- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిజ్జా సర్వర్‌కు గోల్డ్ మెడల్ !
పట్టా చేతిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రస్తుతం ప్రొద్దుటూరులోని రిలయన్స్ మార్ట్‌లో పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

పిజ్జా సర్వర్‌కు గోల్డ్ మెడల్ !
- శ్రమనే ఆభరణంగా మలచుకున్న 'సువర్ణ'
దిశ, కడప : చదువు సాధికారతకు నిదర్శనమైతే, శ్రమ సంస్కారానికి చిహ్నం అని నిరూపిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డితోట సువర్ణ. నిరుపేద కుటుంబం, దినసరి కూలీ అయిన భర్త, పసివాడైన కుమారుడు.. ఇన్ని బాధ్యతల నడుమ ఆమె తన చదువును ఆపలేదు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2019-21 విద్యా సంవత్సరానికి గానూ ఎం.ఏ హిస్టరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె, నేడు శుక్రవారం జరగనున్న వైవీయూ స్నాతకోత్సవంలో ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాన్ని అందుకోబోతున్నారు. పట్టా చేతిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రస్తుతం ప్రొద్దుటూరులోని రిలయన్స్ మార్ట్‌లో పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
తాను గోల్డ్ మెడలిస్ట్ అన్న విషయం తాను పనిచేసే చోట కూడా తెలియనివ్వనంతటి వినమ్రత ఆమె సొంతం. ఉన్నత చదువులు చదివినా, బతుకు పోరాటంలో ఏ పనీ చిన్నది కాదని చాటిచెబుతున్న సువర్ణ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది. పీజీలో గోల్డ్ మెడల్ సాధించినా ఎక్కడా గర్వం ప్రదర్శించకుండా, ఆత్మవిశ్వాసంతో సర్వర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను చూసి స్థానికులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణ పతక విజేతగా నిలిచిన సువర్ణకు పిజ్జా హంట్ సిబ్బంది, బంధువులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
- Tags
- PIZZA
- GOLD MEDAL






