గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు

by Muthe.Rajitha |

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కారాలకు ముహూర్తం ఖరారు అయింది.

గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కారాలకు ముహూర్తం ఖరారు అయింది. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయని పేర్కొంది. కాగా గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తంపై తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ వివరాలను ఎండోమెంట్ కమిషనర్ కు అందించారు. ఈమేరకు గోదావరి పుష్కారాలు తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి మొదలయ్యే పుష్కరాలు జులై 7 వరకు జరగనున్నాయి. కాగా ఈ పుష్కరాల ఏర్పాట్లపై త్వరలోనే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Next Story