- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఇష్యూ.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి CWC లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకేజీ ప్రాజెక్టుపై డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తాజాగా సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA)ను కోరింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకేజీ ప్రాజెక్టుపై డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తాజాగా సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA)ను కోరింది. గోదావరి, కృష్ణా నదుల నీటి నిర్వహణ బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. అయితే. గోదావరి-బనచర్ల ప్రాజెక్టు 1980 గోదావరి నీటి వివాదాల ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశంపై సీడబ్ల్యూసీ సదరు సంస్థలకు సీడబ్ల్యూసీ లేఖలు రాసింది.
అయితే, గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీ నీటిని పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. అయితే, వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం అవసరమని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఇదే విషయంలో, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ, పర్యావరణ మంత్రిత్వ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను పర్యావరణ అనుమతి కోసం తిప్పి పంపింది. అయితే, ఈఏసీ రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించబడాలని, సీడబ్ల్యూసీతో సంప్రదించాలని సూచించింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా కేవలం అదనపు వరద నీటిని మాత్రమే వినియోగించుకుంటామని, తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి తెలిపింది.
పోలవరం సెకండ్ ఫేజ్ తర్వాతే ఆలోచిస్తాం..
గోదావరి-బనకచర్ల లింకేజీ ప్రాజెక్టుపై డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ లేఖ అందిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీకి రిప్లై ఇచ్చింది. గోదావరి-బనకచర్ల లింకేజీ ప్రాజెక్ట్ నిర్మించే అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ తర్వాతే ఆలోచిస్తామని స్పష్టం చేసింది. రెండు ప్రాజెక్ట్‌ల DPRలలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, పోలవరం రెండో దశలో 45.72 మీటర్ల స్థాయికి నీటిని నిల్వ చేశాకే గోదావరి-బనకచర్ల అనుసంధానంపై ఆలోచిస్తామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్‌కు డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ పంపింది.






