- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవా అర్పోరా ఘటన బాధ కలిగించింది : సీఎం చంద్రబాబు
గోవాలోని (Goa) ఉత్తర గోవా జిల్లాలో ఉన్న అర్పోరా గ్రామంలోని ఓ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : గోవాలోని (Goa) ఉత్తర గోవా జిల్లాలో ఉన్న అర్పోరా గ్రామంలోని ఓ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, మనసుకు బాధను కలిగించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
శనివారం అర్ధరాత్రి 'బిర్చ్ బై రోమియో లేన్' అనే నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో నలుగురు పర్యాటకులు, 14 మంది నైట్‌క్లబ్ సిబ్బంది ఉన్నారని గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తర గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా సందేశాన్ని పంపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
ఈ దారుణ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఊపిరాడక మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. గోవా ముఖ్యమంత్రి సావంత్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నైట్‌క్లబ్ అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని గోవా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా విషాదం నింపిన ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసి, గోవా ముఖ్యమంత్రితో మాట్లాడారు.






