- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో ప్రపంచ సామరస్య వేడుకలు.. అదరగొట్టిన విదేశీ విద్యార్థులు
ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మంగళవారం ప్రపంచ సామరస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.

దిశ, మంగళగిరి: ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మంగళవారం ప్రపంచ సామరస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. విదేశీ విద్యార్థుల మధ్య సోదరభావాన్ని, సంఘటితాన్ని బలపరిచే లక్ష్యంతో యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ హయ్యర్ స్టడీస్ విభాగం వేడుకలతో కూడిన పండుగను తొలిసారి ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఆర్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనరసింహన్ గ్లోబల్ ఫెస్టివల్ ఆఫ్ హార్మొని ప్రత్యేకతను వివరించి, కార్యక్రమానికి హాజరైన అతిథులు, విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్ దేశ, విదేశ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థులు ఏ దేశం వారైనప్పటికీ, విశ్వవిద్యాలయంలో మాత్రం ఎస్ఆర్ఎం విద్యార్థులే అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులందరి మధ్యా సోదరభావం పెరిగి అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థుల మధ్య సామరస్యత పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ తరహా వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు.
అలరించిన విదేశీ విద్యార్థుల నృత్యాలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో వివిధ దేశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి వారి సంస్కృతులకు అనుగుణంగా నృత్యాలను ప్రదర్శించారు. శ్రీలంక, నేపాల్, కువైట్, దుబాయ్ ఆఫ్రికా, దేశాల విద్యార్థులు అందరం ఒక్కటే అన్న భావనతో ప్రదర్శించిన నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కల్చరల్ వాక్, క్రీడల పోటీలు, షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ దేశాల విద్యార్థులు వారి వారి సంస్కృతులు, అభిరుచులకు అనుగుణంగా వస్త్ర ధారణ చేసుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఆర్హెచ్ఎస్ డైరెక్టర్ లక్ష్మీనరసింహన్, అసోసియేట్ డైరెక్టర్ సుదర్శన్, వికాస్ భరద్వాజ్, భావన దీప, స్టూడెంట్స్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ రేవతి, తదితరులు పాల్గొన్నారు.






