- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పీఎం శ్రీ’లో మరిన్ని సూళ్లకు అవకాశం ఇవ్వండి
రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద మరిన్ని పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద మరిన్ని పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పీఎం శ్రీ ఫేజ్-1,2 లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు 855కు మాత్రమే మంజూరయ్యాయన్నారు. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ – 3లో మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంను ఏపీలో ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని వివరించారు. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. రిసెర్చి, ఇన్నోవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామిని ఢిల్లీలోని ఆయన నివాసంలో మంత్రి లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి లోకేశ్ కోరారు.






