తండ్రి అప్పు తిరిగి ఇవ్వలేదని.. బాలిక అపహరణ!

by Thanuru Gopichand |

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఓ బాలికను దుండగులు అపహరించారు.

తండ్రి అప్పు తిరిగి ఇవ్వలేదని.. బాలిక అపహరణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి ఓ బాలికను దుండగులు అపహరించారు. తండ్రి తీసుకున్న బాకీ తీర్చనందుకే అపహరించినట్లు అనుమానిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం చీమకుర్తి పోలీసులు గాలిస్తున్నారు. బాలికను నెల్లూరు వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి అపహరించినట్లు భావిస్తున్నారు. ఈశ్వర్ రెడ్డి వద్ద బాలిక తండ్రి రూ.5 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. తండ్రి తీసుకురమ్మన్నాడు అని చెప్పి బాలికను తీసుకువెళ్లినట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వాలని కుమార్తెతో ఆమె తండ్రికి ఈశ్వర్ రెడ్డి ఫోన్ చేయించాడు. దీంతో బాలిక అపహరణపై కుటుంబ సభ్యులు పో లీసులను ఆశ్రయించారు. తిరుపతి వైపు వెళ్తున్న ఈశ్వరుని పోలీసులు వెంబడిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story