- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్వతీపురం జిల్లాలో ఘోరం
పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో (Chinthala Belagam) అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో (Chinthala Belagam) అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. గ్రామంలో దళితులకు ప్రత్యేక శ్మశానవాటిక (Graveyard) లేకపోవడంతో.. ఒక నిరుపేద కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని గత్యంతరం లేక రోడ్డు పక్కన ఖననం చేసింది. అయితే ఆ స్థలం ఒక రైతు ఆధీనంలో ఉండటంతో వివాదం నెలకొంది. సదరు రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మారింది. కనీస మానవత్వం లేకుండా రాత్రికి రాత్రే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీయాల్సిన దుస్థితి ఏర్పడింది. పూడ్చిపెట్టిన పెట్టిన చోటు నుంచి అక్కడికి కేవలం మూడు అడుగుల దూరంలో మరోచోట మృత దేహాన్ని అధికారులు పూడ్చిపెట్టాల్సి వచ్చింది. మరణించిన వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లేకపోగా, ఇలా మృతదేహాన్ని బయటకు తీసి పక్కకు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణమైన చర్య పట్ల దళిత సంఘాలు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా శ్మశాన వాటిక కోసం విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, చనిపోయిన తర్వాత కూడా శాంతి లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. కనీసం ఖననం చేయడానికి సరైన స్థలం లేక రోడ్డు పక్కన పూడ్చాల్సి వస్తుందని అంటున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పక్కన పెట్టే పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చింతలబెలగాం దళితులకు శ్మశాన వాటిక కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.






