- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో (Ambedkar Konaseema District) మరోసారి గ్యాస్ పైపులైను నుంచి గ్యాస్ లీకైంది. ఈ ఘటన జిల్లాలోని మలికిపురం (Malikipuram) మండలంలోఉన్న ఓఎన్జీసీ పైపులైనులో (ONGC Pipeline) జరిగింది. పైపులైను నుంచి లీకైన గ్యాస్ ఒక్కసారిగా గాలిలోకి ఎగజిమ్మింది. దీంతో మంటలు చెలరేగి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా గ్యాస్ పైపులైను లీకయ్యి మంటలు ఎగజిమ్ముతుండడంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న మండల తహశీల్దార్ శ్రీనివాస రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓఎన్జీసీ అధికారులు తెలియజేసినట్లు తహశీల్దార్ తెలియజేశారు. సంస్థకు సంబంధించిన సాంకేతిక నిపుణులు త్వరలోనే సంఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. వారు గ్యాస్ లీకును అరికడతారని ప్రకటించారు. అయితే గతేడాది ఆగస్టులో కూడా మలికిపురం మండలంలోని ఇరుసుమండ సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైను లీకయ్యింది. తరచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు వెలుగు చూస్తుండడం పట్ల మండలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తగిన భద్రతా చర్యలు తీసుకొని లీకేజీలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. లేదంటే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుందని అంటున్నారు.






