- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. పరిశ్రమలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి
by Naga Rani Yarlagadda |
టైల్స్ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టైల్స్ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో ఎల్లంపాడు గ్రామానికి సమీపంలో జరిగింది. కార్మికులు పరిశ్రమలో పనిచేస్తుండగా.. ఉన్నట్లుండి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పోతురాజు (30), పాండు (30) అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు వారిని వెంకటగిరి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Next Story






