గంగవరం పోర్టును స్తంభింపచేస్తాం.. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

by Dishafeatures2 |
గంగవరం పోర్టును స్తంభింపచేస్తాం.. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
X

దిశ, గాజువాక: అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరి విడనాడక పోతే పోర్టు ను స్తంభింప చేస్తామని గాజువాక నియోజక వర్గ శాసన సభ్యులు తిప్ప ల నాగిరెడ్డి హెచ్చరించారు. కనీస వేతనాలు పెంచాలని గంగవరం పోర్టు వర్కర్స్ యూనియన్,రాజకీయ, నిర్వాసిత సంఘాలకు చెందిన నాయకులు మంగళవారం పెద గంట్యాడ ఉక్కు ఆసుపత్రి కూడలిలో నిరవదిక నిరసనలు చేపట్టారు. గంగవరం పోర్టు ఉద్యోగులు చేపట్టిన నిరవధిక నిరసన కార్యక్రమానికి ఎంఎల్ఏ నాగిరెడ్డి హాజరై సంఘీభావం ప్రక టించి మాట్లాడారు. గంగవరం పోర్టు కార్మికులకు కనీస వేతనం రూ 36 వేలు ఉండాలని అన్నారు. కనీస వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోర్టు కార్మికులు ఆందోళనలు చేపట్టినప్పటికీ యాజమాన్యం లో చలనం లేదన్నారు. జిల్లా కలెక్టర్ సమక్షం లో కార్మికుల సమస్యలపై చర్చలు జరిగి నప్పటికీ గంగవరం పోర్టు యాజమాన్యం సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాకపోవడంతో సమస్య జటిలమైందని అన్నారు.

పోర్టు కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరు తప్పదన్నారు. గాజువాక నియోజక వర్గం సీపీఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. గంగవరం పోర్టు కార్మికులు కనీస వేతనాల కోసం పోరాడుతుంటే పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అణచి వేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తుందని అన్నారు. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే లు పల్లా శ్రీనివాసరావు, చింతల పూడి వెంకటరామయ్య మాట్లాడుతూ.. గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరి విడ నాడి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. గత 14 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పోర్టు కార్మికులు జీవితాలను వెళ్ళదీస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కోన తాతారావు, 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, పోర్టు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed