ఉచిత బస్సు పథకానికి నిధులు విడుదల.. ఎన్ని కోట్లో తెలుసా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 11:08:08  IST  )

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు(RTC Bus)ల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే.

ఉచిత బస్సు పథకానికి నిధులు విడుదల.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు(RTC Bus)ల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ‘స్త్రీ శక్తి’ పేరిట ఆగష్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు అవుతోంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేస్తున్నారు. తాజాగా.. ఉచిత బస్సు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గురువారం నాడు రూ.400 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చు మొత్తం చెల్లించింది.

Next Story