ఇంట్లో బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. కాలి బూడిదైన వస్తువులు

by Ajay Maddhiboyina |

ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఫ్రిడ్జ్ పేలి తల్లి, కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇంటిముందు దుకాణంలోని ఫ్రిడ్జి పేలడంతో పక్కనే ఉన్న తల్లి, కుమారుడికి తీవ్రగాయాలై చనిపోయారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరిలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఇంట్లో బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. కాలి బూడిదైన వస్తువులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఫ్రిడ్జ్ పేలి తల్లి, కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇంటిముందు దుకాణంలోని ఫ్రిడ్జి పేలడంతో పక్కనే ఉన్న తల్లి, కుమారుడికి తీవ్రగాయాలై చనిపోయారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరిలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం కొండవారిపాలెంలో ఓ ఇంట్లో ఫ్రిజ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఫ్రిజ్ పేలడంతో ఇంట్లోని వస్తువులు అన్నీ కాలిపోయాయి, ఇల్లంతా పొగలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక ఫ్రిజ్ ప్రమాదాలకు కంప్రెసర్ పై ఒత్తిడి కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా మెకానిక్ కు చూపించి రిపేర్ చేయించాలని సూచిస్తున్నారు. ఫ్రిజ్ లను గోడలకు మరీ అతుక్కుపోయేలా పెట్టకుండా కాస్త దూరంగా ఉండేలా చూడాలని సూచిస్తున్నారు.

Next Story