ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత టిఫా స్కాన్

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని 7 సెకండరీ ఆస్పత్రుల్లో కొత్తగా టిఫా స్కానింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత టిఫా స్కాన్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని 7 సెకండరీ ఆస్పత్రుల్లో కొత్తగా టిఫా స్కానింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ టిఫా స్కానింగ్‌ ద్వారా గర్భస్థ శిశువుల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో టిఫా స్కానింగ్‌ యంత్రానికి సుమారు రూ.30.48 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, నందిగామ, ఒంగోలు, తెనాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి నెల నుంచి గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయిలో టిఫా స్కానింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

Next Story