దివ్యాంగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం

by Muthe.Rajitha |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు శుభవార్త తెలిపారు.

దివ్యాంగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు శుభవార్త తెలిపారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తరఫున 7 కీలక వరాలను ప్రకటించారు. ఇకపై ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో 'దివ్యాంగ్ భవన్' ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

దివ్యాంగులకు మళ్లీ ఫైనాన్షియల్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. శాప్‌ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story