- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈ నెల 23 నుంచి కొత్త కార్యక్రమం !
స్కూల్ విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. ఆధార్ లో ఏమైనా పేర్లు తప్పిదం పడితే, అప్డేట్ చేసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంప్స్ ( Aadhaar Camps ) నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్స్ లో ఈ ఆధార్ స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు.
ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. ఆధార్ లో ఏమైనా పేర్లు తప్పిదం పడితే, అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 16 లక్షల మందికి పైగా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని అంటున్నారు. అయితే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సేవలను ఉచితంగా అందించనుంది. ఈ ఆధార్ అప్డేట్ కార్యక్రమం ద్వారా తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.






