- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లవారితే పుట్టినరోజు.. అంతలోనే అనంతలోకాలకు చేరిన చిన్నారి
by Muthe.Rajitha |
తెల్లవారితే పుట్టినరోజు జరుపుకోవాల్సిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెల్లవారితే పుట్టినరోజు జరుపుకోవాల్సిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గార్లెదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన నాలుగేళ్ళ చిన్నారి తనూజ ప్రతిరోజూ మాదిరిగానే స్కూల్ కు వెళ్లి, ఆటోలో ఇంటివద్ద దిగింది. అయితే అదే ఆటో వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే తనూజ మృతి చెందిందని సైద్యులు ధృవీకరించారు. దీంతో రేపు సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో కన్నీటి విషాదం నిండింది. తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తుంటే, ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసారు.
Next Story






