- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్.. రోడ్డుపై నడిపించిన పోలీసులు
అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించారు...

దిశ, వెబ్ డెస్క్: గంజాయి(Ganjai) విక్రయం, వినియోగంపై నిషేధం ఉన్నా కొందరు మాత్రం పట్టించుకోవడంలేదు. యదేచ్ఛగా క్రయ, విక్రయాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్న సమాచారం అందితే చాలు వెంటనే అక్కడ వాలిపోతున్నారు. తనిఖీలు నిర్వహించి కేజీల, కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలాంటి తాజాగా అనంతపురంలో జరిగింది. స్థానిక అశోక్ నగర్ సమీపంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గుర్తించారు. నిందితుల వద్ద కేజీ గంజాయిని పట్టుకున్నారు.
నిందితులు అనంతపురం శివారు ప్రాంతాల్లో ఇమ్రాన్, సాయి ప్రసాద్, జంబ, శివ కొంతకాలంగా గంజాయి దందా నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి అనంతపురం పట్టణంలో యువకులకు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న అనంతపురం వన్ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకూ నిందితులను రోడ్డుపై కాలినడక నడిపించుకుంటూ తీసుకెళ్లారు. గంజాయి విక్రమం, వినియోగం నేరమని, తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.






