మంగినపూడి బీచ్‌లో నలుగురు యువకులకు ప్రమాదం.. రక్షించిన కానిస్టేబుల్స్

by Vemula.Srinu Prasad |

మంగినపూడి బీచ్‌లో నలుగురు యువకులకు ప్రమాదం తప్పింది...

మంగినపూడి బీచ్‌లో నలుగురు యువకులకు ప్రమాదం.. రక్షించిన కానిస్టేబుల్స్
X

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నం(Machilipatnam) మంగినపూడి బీచ్‌(Manginapudi Beach)లో నలుగురు యువకులకు పెను ప్రమాదం తప్పింది. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్, ఆర్ఫాద్, సికిందర్, షరీఫ్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే అలలు బాగా ఉధృతంగా ఎగిసిపడుతున్నా. అయినా సరే సముద్రంలోకి వెళ్లి స్నానం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి నలుగురు యువకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోయేంత పని అయింది. అయితే ఒడ్డున ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తాడు సాయంతో నలుగురు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో నలుగురు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Next Story