Breaking: తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం

by Vemula.Srinu Prasad |

Breaking: తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌(Kidnap)కు గురయ్యారు.ఆస్థాన మండపం నుంచి దీక్షితను వృద్ధురాలు ఎత్తుకెళ్లారు. దీక్షిత తల్లిదండ్రులు తిరుమలలో చిరు వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం చిన్నారి ఆస్థాన మండపం ఆడుకుంటోంది. అక్కడకు వెళ్లిన వృద్ధురాలు చిన్నారిని తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీ ఫుటేజులో రికార్డయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వృద్ధురాలు ఫొటోను విడుదల చేశారు. గతంలోనూ పలువురు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీంతో చిన్నారి దీక్షిత కిడ్నాప్‌పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను వెంటనే గుర్తించి అప్పగించాలని కోరుతున్నారు.

Next Story