- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో దారుణం.. వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
గుంటూరులో వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో దారుణం జరిగింది. స్వర్ణభారతి నగర్(Swarna Bharati Nagar)కు చెందిన నాగరాజు, రాణి దంపతులకు నాలుగేళ్ల బాలుడు(Four year boy) ఐజాక్ ఉన్నాడు. రోజూ మాదిరిగానే వీధిలో ఆడుకుంటున్నాడు. అయితే ఐజాక్‌పై వీధి కుక్క(Street Dog) ఒక్కసారిగా దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా విచక్షరహితంగా కరిచింది. బాలుడి ఏడుపు విన్న స్థానికులు కుక్కను తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు ఐజాక్ మృతి చెందారు. ఐజాక్ మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బాలుడి తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయారు. ఈఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా గుంటూరు మున్సిపల్ అధికారులు కళ్లు తెరవాలని, వెంటనే వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






