- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు గంటల్లో 4 వేల సమస్యలకు పరిష్కారం
ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 70వ రోజుకు చేరుకుంది...

దిశ, ఏపీ బ్యూరో: ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 70వ రోజుకు చేరుకుంది. దీంతో ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. నాలుగు గంటల పాటు దాదాపు 4 వేలమందికి కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సమస్యల పరిష్కరిస్తానని బాధితులకు మంత్రి లోకేష్ హామీ
టీడీపీ కార్యకర్తనైన తనపై వైసీపీ పాలనలో అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు ఆ పార్టీ నేతల ప్రోద్బలంతో తన భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్‌ను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట గ్రామానికి చెందిన దనపాన హరికృష్ణ కలిసి విజ్ఞప్తి చేశారు.
తనకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేసేందుకు వైసీపీ కార్యకర్త అన్నలదాసు జోసెఫ్ యత్నిస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన మెరిగల రవిబాబు మంత్రి నారా లోకేష్‌ను కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.






