- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ పాల కలకలం.. చిన్నారులు, వృద్ధులపై ఫుల్ ఎఫెక్ట్..!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాలు తాగిన రెండు కాలనీల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయి నలుగురు మృతి చెందారు. ...

దిశ, వెబ్ డెస్క్: కల్తీ పాల(Adulterated Milk) ఘటన కలకలం రేగిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry) నగరంలో పాలు తాగిన రెండు కాలనీల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయి నలుగురు మృతి చెందారు. చౌడేశ్వరినగర్, వెంకటేశ్వర నగర్ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్రవైన బాధపడ్డారు. చిన్నారులు, వృద్ధులు కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. దీంతో వారికి కిమ్స్, రెయిన్‌బో ఆస్పత్రుల్లో(KIMS, Rainbow Hospitals) చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనకు కారణమైన పాల శ్యాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
రాజకీయ దుమారం
అయితే ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. కల్తీ పాల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే కల్తీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విజయవాడ నుంచి డయాలసిస్ పరికరాలు తెప్పిస్తున్నామన్నారు. రెయిన్ బో, కిమ్స్‌లో బాధితులతో మాట్లాడామని తెలిపారు. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం అధికారంగా ఉందని చెప్పారు. కల్తీపై మాట్లాడే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని హెచ్చరించారు






