- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు దగ్ధం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వి కావేరి ట్రావెల్స్ (V.kaveri bus accident) బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సుమారు 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్డెస్క్: కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వి కావేరి ట్రావెల్స్ (V.kaveri bus accident) బస్సు అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సుమారు 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాలకు స్పాట్లోనే పోస్టుమార్టం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకున్న FSL టీమ్ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కాగా.. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లుగా గుర్తించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Banglore) వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న నెల్లూరు జిల్లా వాసులు మరణించారు. వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులు మరణించినట్లు అధికారులు గుర్తించారు. వృత్తిరీత్యా కుటుంబంతో బెంగళూరులో స్థిరపడిన రమేష్.. దీపావళి పండుగకు హైదరాబాద్ కు వచ్చి గురువారం తిరుగుపయనమయ్యారు. వీరంతా గురువారం సాయంత్రం వనస్థలిపురంలో బస్సు ఎక్కారు. గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు.






