BIG BREAKING: రాష్ట్రంలో కలకలం.. నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది.

BIG BREAKING: రాష్ట్రంలో కలకలం.. నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ లకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు అందడం మంత్రులు, నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ లాబీలో ఈ వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరిగింది. తనకు బెదిరింపు లేఖలు రాయడంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. తాను మంత్రిగా పర్యవేక్షిస్తున్నది చాలా చిన్న శాఖ అని, బెదిరింపు లేఖతో తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారన్నారు. తాను వ్యక్తిగతంగా, శాఖాపరంగా ఏ తప్పూచేయలేదని, అలాంటపుడు మావోయిస్టులకు లేఖ రాయాల్సిన పనేముందన్నారు. ఇది ఎవరో మావోయిస్టుల పేరుతో కావాలనే లేఖలు రాసినట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. లేఖలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం విచారణ జరుగుతుందని తెలిపారు. దీనివెనుక ఉన్నదెవరైనా చట్టం కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు.

Next Story