Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు ఏపీ వాసులు మృతి

by Vemula.Srinu Prasad |

కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు ఏపీ వాసులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జి (Bridge) గోడను బొలెరో వాహనం(Bolero Vehicle) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అనంతపురం జిల్లా హిందూపురం వాసులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు నాగభూషణ్, నాగరాజు, మురళి, సోమగా గర్తించారు. కర్ణాటక యాద్గిర్ జిల్లా షహార్ పూర్ సంతలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. రాయ్ చూర్ జిల్లా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్‌పురాలో వీరు ప్రయాణిస్తున్న వాహనం బ్రిడ్జిని ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో బ్రిడ్జిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story