- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో అల్పపడనం.. రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు
: ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని, తరవాత 24 గంటల్లో అది పశ్చిమ వాయివ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని, తరవాత 24 గంటల్లో అది పశ్చిమ వాయివ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయివ్యదిశగా కదులుతూ తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. కోస్తా ప్రాంతంలో గంటకు 30 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ప్రకాశం, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.






