స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతు.. గాలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-24 12:45:32  IST  )

తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురులు గల్లంతయ్యారు..

స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతు.. గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. స్వర్ణముఖి నది(Swarnamukhi River)లో నలుగురు బాలురులు( Boys) గల్లంతయ్యారు. తిరుపతి జిల్లా(Tirupati District) వేదాంతపురం దగ్గర జరిగింది. ప్రకాశ్, తేజు, ముని చంద్ర, బాలు సరదాగా ఈత కొట్టేందుకు స్వర్ణముఖి నది వద్దకు వెళ్లారు. నదిలో దిగి ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నలుగురు గల్లంతయ్యారు. స్థానికులు బాలురుల కోసం నదిలో గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story