నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మళ్లీ జైలుకు ఆ నలుగురు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో కస్డడీ ముగియడంతో నలుగురు నిందితులను మళ్లీ జైలుకు తరలించారు...

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మళ్లీ జైలుకు ఆ నలుగురు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరింత సమాచారం రాబట్టేందుకు నలుగురు నిందితుల(Accused)ను ఐదురోజుల పాటు ఎక్సైజ్ అధికారులు(Excise Officers) విచారించారు. కస్టడీ(Custody)ముగియడంతో విజయవాడ కోర్టు(Vijayawada Court)లో ప్రవేశపెట్టారు. దీంతో రిమాండ్‌లో భాగంగా జైలుకు తరలించాలని విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నలుగురు నిందితులను తిరిగి జైలుకు తరలించారు.

కాగా నకిలీ మద్యం కేసులో కట్టారాజు, సయ్యజ్ హజీ, అంథా దాస్, మిథన్ దాస్ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి నుంచి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ నలుగురు నిందితులను ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిందితులను ఐదు రోజులు పాటు విచారించారు. వారి చెప్పిన సమాధానాలను రికార్డు చేశారు. ఐదు రోజుల కస్టడీ ముగియడంతో కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ప్రస్తుతం వారంతా రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఈ కేసులో తదుపరి అధికారుల నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.

Next Story