- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా స్నేహితుడిని వేధిస్తున్నారు: పోలీసులపై NHRCలో కేశినేని నాని ఫిర్యాదు
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆశ్రయించారు. తన స్నేహితుడైన తాతానేని రాంబాబుపై పోలీసులు తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆశ్రయించారు. తన స్నేహితుడైన తాతానేని రాంబాబుపై పోలీసులు తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాంబాబును లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయకుండానే పోలీసులు రాంబాబుతో పాటు ఆయన తల్లిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కేశినేని నాని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన అధికార పరిధిని దాటి మరీ రాంబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కమిషన్ దృష్టికి కేశినేని తీసుకెళ్లారు.
ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది
ప్రస్తుతం జరుగుతున్న పోలీసుల వేధింపుల కారణంగా రాంబాబు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కేశినేని నాని కోరారు.






