- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువత మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వాలి: వెంకయ్యనాయుడు పిలుపు
by Ramesh Naini |
యువత తమలోని శక్తి, సామర్థ్యాలను గుర్తించి దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: యువత తమలోని శక్తి, సామర్థ్యాలను గుర్తించి దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం బలోపేతం కావాలంటే యువత కార్యోన్ముఖంగా ఉండాలని, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. యువత వ్యక్తిత్వ వికాసానికి యోగి వేమన బోధనలు మార్గదర్శకాలని పేర్కొన్నారు. వేమన పద్యాలు సరళమైన పదాలతో ఉన్నప్పటికీ, లోతైన జీవిత సత్యాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. యువత మాతృభాష (mother tongue), భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story






