నీళ్లల్లో రాజధాని అమరావతి ఉంది: కేంద్ర మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-22 16:33:49  IST  )

నీళ్లల్లో రాజధాని అమరావతి ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు..

నీళ్లల్లో రాజధాని అమరావతి ఉంది: కేంద్ర మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: నీళ్లల్లో రాజధాని అమరావతి(Amaravati)ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. అమరావతి పేరుతో 70 వేల ఎకరాలు తీసుకున్నారని, మూడు పూటలా పంటలు పండే, భూములు ఇచ్చేందుకు రైతులకు ఇష్టం లేదన్నారు. అమరావతి దేవతల రాజధాని అంటారని, తనకైతే దేవతలు కనిపించలేదన్నారు. కర్ర తుమ్మ చెట్లు కనిపించిందని చెప్పారు. 20 జిల్లాల్లోని ప్రజలు చాలా తక్కువగా అమరావతిని ఇష్టపడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతిపై సంతోషంగా లేరన్నారు. రాయలసీమ జిల్లాల్లో, ఎక్కడైనా పరిపాలనా రాజధాని పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో హైకోర్టు హైకోర్టు ఉంటే బాగుండేదని చెప్పారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, కడప కోటిరెడ్డి కడపను రాజధాని చేయాలని గట్టిగా కోరాని ఆయన గుర్తు చేశారు. ఎన్జీరంగా, తరిమెల నాగిరెడ్డి తిరుపతిని రాజధానిని చేయాలని కోరినట్టు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు.

Next Story