- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టికొట్టుకుపోతారు.. మళ్లీ ఇలాంటివి చేయొద్దు: టీటీడీ మాజీ ఈవో హెచ్చరిక
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం(Tirumala adulterated ghee affair)పై టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం(Former TTD EO and retired IAS officer LV Subramaniam) స్పందించారు. తిరుమలలో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీ అధికారులు పీఠాధిపతుల సూచనలను పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో ఆవు నెయ్యి లభ్యత పెరిగేలా చూసుకోవాలన్నారు. అమూల్ మాదిరిగానే రాష్ట్రంలో సహకారం డెయిరీ పెట్టాలని చెప్పారు. శ్రీవారి భక్తులకు నమ్మకం కలిగించాలని చెప్పారు. స్వామి వారి సంపద కొందరు దోచుకున్నారని, ప్రస్తుతం వారి దుస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం ఘోర తప్పిదనమని ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
ఈ జన్మలోనే..
తిరుమలలో తప్పు చేసిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని, హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకోరని ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. తిరుమల లడ్డూ విషయాన్ని రాజకీయం చూడొద్దని, టీటీడీ చైర్మన్ పదవి సామన్యమైందని కాదన్నారు. టీటీడీ పాలక మండలి భక్తి పూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. టీటీడీలో నెయ్యి కొనుగోలుకు కమిటీ అనేది ఉంటుందని, వాళ్ల గాని అవినీతికి పాల్పడితే మట్టికొట్టుకుపోతారని హెచ్చరించారు. నాణ్యత లేదని తెలిసీ నెయ్యిని అనుమతించిన వారు శిక్ష అనుభవిస్తారన్నారు. ఈ ఘటనతోనైనా ఉద్యోగులు చైతన్యంతో పని చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.






