తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై టీటీడీ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై టీటీడీ మాజీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే నెయ్యి కల్తీపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో నెయ్యి కల్తీ నిజమేనని తాజాగా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో పామాయిల్, పామ్‌కెర్నల్ ఆయిల్ వంటి ఇతర పదార్థాలు కలిశాయని సిట్ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కల్తీ వెనుక పలువురు వ్యక్తులు, అధికారులు, థర్డ్ పర్సన్ ప్రమేయం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేపట్టింది. జనవరి 22న తుది చార్జిషీట్‌ను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ ప్రకారం.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో 'వెజిటబుల్ ఆయిల్' కల్తీ జరిగిందని, నాణ్యత పరీక్షల్లో అది బయట పడకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కలిపారని సిట్ గుర్తించింది. జంతువుల కొవ్వు, చేప నూనె వంటివి ఉండే అవకాశాలు లేవని ల్యాబ్ నివేదికలను పేర్కొంటూ సిట్ చార్జిసీట్‌లో ప్రస్తావించింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో నెయ్యి కల్తీ ద్వారా రూ.234 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొంటూ, అందుకు బాధ్యులుగా కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి మొత్తం 36 మందిపై సిట్ పలు కేసులు నమోదు చేసింది.

Next Story