జీవితాంతం అండగా ఉంటా: బాలకోటిరెడ్డి కుటుంబానికి లోకేశ్ భరోసా

by Vemula.Srinu Prasad |

జీవితాంతం అండగా ఉంటానని టీడీపీ మాజీ ఎంపీపీ వెన్నా మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చారు....

జీవితాంతం అండగా ఉంటా: బాలకోటిరెడ్డి కుటుంబానికి లోకేశ్ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: జీవితాంతం అండగా ఉంటానని టీడీపీ మాజీ ఎంపీపీ వెన్నా మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి(Former MPP Venna Balakoti Reddy) కుటుంబానికి భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామం(Alavala Village)లో బాలకోటిరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కార్యకర్తల బాధ్యతను తాను తీసుకుంటానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తాను పెద్ద కొడుకులా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాల కోటిరెడ్డి 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశారని, ఓర్వలేని కొంతమంది వైసీపీ(Ycp) మూకలు.. బాలకోటిరెడ్డి నిద్రిస్తుండగా తుపాకీతో కాల్చి చంపారని మండిపడ్డారు. బాలకోటిరెడ్డికి ప్రాణహానీ ముందుగానే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి కార్యకర్తలను నేరుగా కలుసుకుంటానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

Next Story