- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేనె ఎగుమతిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ వైకాపా నేత.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) దేశంలో తేనె ఎగుమతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ వైకాపా నేత.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) దేశంలో తేనె ఎగుమతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును హిందీ భాషలో పంచుకున్నారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా (Honey Exporter) అవతరించిందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.07 లక్షల మెట్రిక్ టన్నుల తేనెను ఎగుమతి చేయడం ద్వారా దేశం 177.55 మిలియన్ డాలర్లు ఆర్జించిందన్నారు. 2020లో భారతదేశం ఈ రంగంలో తొమ్మిదవ స్థానంలో ఉందన్నారు. అయితే కేవలం కొన్ని సంవత్సరాలలో ఈ ఘనతను సాధించడం రైతులకు, పారిశ్రామికవేత్తలకు గొప్ప విజయంగా అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక తేనెటీగల పెంపకం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. తేనె ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ కోసం ఎంఎస్ఎంఈ (MSME) క్లస్టర్లను అభివృద్ధి చేయాలన్నారు. ఈ రంగంలో యువ రైతులు, మహిళలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇది దేశంలో లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలదన్నారు. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత శక్తివంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






