నాయకులారా ఇప్పటికైనా గుర్తించండి..: విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, నాయకులను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది..

నాయకులారా ఇప్పటికైనా గుర్తించండి..: విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, నాయకులను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp Vijayasai Reddy) చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!. వెనిజువెలా(Venezuela)లో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పేలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? “వారంతా అమ్ముడు పోవటమే కదా” !’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Next Story