- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేంద్రీయ పద్ధతిలో విజయసాయిరెడ్డి వ్యవసాయం.. స్వయంగా జీవామృతం తయారీ
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాలక్షేపం కోసం వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని తొండుపల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో ఆయన సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy) కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాలక్షేపం కోసం వ్యవసాయం(Farming) చేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) శివారులోని తొండుపల్లి(Tondupalli)లోని తన వ్యవసాయక్షేత్రంలో ఆయన సేంద్రీయ పద్ధతి(Organic method)లో సాగు చేస్తున్నారు. పంట తొలిచే పురుగులను నియంత్రించేందుకు మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం “జీవామృతం”ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి. పుట్టమట్టిని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తిప్పి జీవామృతాన్ని తయారు చేసి చెట్లకు పోస్తున్నారు. రైతులు కూడా ఇలానే జీవామృతాన్ని వినియోగించాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. విజయసాయిరెడ్డి ‘జీవామృతం’ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.






