- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్డి అనుబంధ కార్యక్రమంలో.. హిందూ ధర్మంపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
హిందూ ధర్మంపై మాజీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ‘‘హిందూ ధర్మానికి కాపు కాద్దాం… కలసి రండి…. మత మార్పిడులు అడ్డుకుందాం.’’ అని మాజీ ఎంపీ విజయసాయి పిలుపునిచ్చారు. రెడ్డి అనుబంధ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్లందరూ కాపులేనని తెలిపారు. కాపుల్లో నుంచి గ్రామ ప్రజలందరికీ తానున్నానని ముందుకువచ్చిన వాళ్లు రెడ్లేనని చరిత్ర చెబుతోందన్నారు. రెడ్డి నాయకత్వ లక్షణాలు, సమాజంలో బాధ్యతలు స్వీకరించే గుణం కలిగిన వాళ్లే రెడ్డి సామాజిక వర్గంగా కాలక్రమేణా అవరించబడిందన్నారు. సమాజం, దేశ శ్రేయస్సుకోసం భారత జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి ధైర్యవంతంగా ఎదుర్కొనగలిగే సామాజిక వర్గమని రెడ్డి సామాజిక వర్గమని తాను తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సామాజికవర్గంలో తమదైన శైలిని వ్యవహరించి ఈ దేశ ప్రగతికి మూలకారణంగా , దైశ ప్రజలను సరైన మార్గంలో పెట్టే పద్ధతులను తీసుకొచ్చే బాధ్యతను రెడ్డి సోదరులపై ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు.
భారత్‌లోకి విదేశీ ధర్మాలు వచ్చాయి..
భారత్‌లోకి విదేశీ ధర్మాలు వచ్చాయని, అందుకే కన్వర్షన్లు జరుగుతున్నాయని చెప్పారు. అలాంటి వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ కొనసాగించరాద్నారు. విదేశీ ధర్మం దేశంలో ఉంటే హింధూ ధర్మం భవిష్యత్తులో ఉండదని చెప్పారు. మనదేశంలో హింధూ ధర్మం లేకపోతే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కన్వర్షన్స్‌ను ఆపే బాధ్యత, ఉద్యమంగా కార్యాచరణతో ప్రతి ఒక్కసామాన్యుడు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కన్వర్షన్స్‌ను తాను కూడా వ్యతిరేకిస్తున్నానని, ఎళ్లప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడతానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.






