పోలవరం పనులపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పోలవరం పనులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు..

పోలవరం పనులపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నిర్దేశిత సమయం పెట్టుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లలో నత్తనడక సాగిన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకుంది. అయితే డయా ఫ్రమ్ వాల్ వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం మళ్లీ కొత్తగా వాల్‌ను నిర్మిస్తోంది.కానీ పనులు మాత్రం నత్తనడక సాగుతున్నాయని, ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు తరచూ అక్కడ పర్యటించడంతో అధికారులంతా వాళ్ల చుట్టే తిరుగుతున్నారని, తద్వారా పోలవరం పనులు అలస్యంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా జరుగుతున్నాయనేది మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రూ. 440 కోట్లతో డ్యామ్ నిర్మించారని గుర్తు చేశారు. కానీ వరదలో కొట్టుకుపోయిందని, మళ్లీ అదే కంపెనీకి రూ. 990 కోట్లతో పనులు అప్పగించారని పేర్కొన్నారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకోవడంపై ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా..?, ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా అనే విషయాన్ని చెప్పాలన్నారు. డయా ఫ్రమ్ వాల్ మళ్లీ కొట్టుకుపోతే ఏ చేయాలనేది స్పష్టం చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Next Story