రాష్ట్రంలో తీవ్ర విషాదం.. మాజీ MP కన్నుమూత

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయా(AP Politics)ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. మాజీ MP కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయా(AP Politics)ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం(Machilipatnam) మాజీ ఎంపీ, చల్లపల్లి జమిందారు తనయుడు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్(Yarlagadda Ankineedu Prasad) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి కోయంబత్తూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1967లో బందర్ ఎంపీగా ఆయన ఎంపికయ్యారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అభిమానుల సందర్శనార్థం శనివారం చల్లపల్లికి ఆయన భౌతికాయాన్ని తీసుకొస్తారు. ఆయన మృతితో చల్లపల్లిలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సన్నిహితులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story