- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ నుంచి ఏచూరి.. నగరి నుంచి నారాయణ పోటీ
by GSrikanth |
ఏపీ ఎన్నికల్లో వామపక్ష నేతల పోటీపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల్లో వామపక్ష నేతల పోటీపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ లోక్‌సభ నుంచి సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాగా, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఏపీలో సైతం పూర్వవైభవం తీసుకరావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఏపీని టార్గెట్ చేసింది.
Next Story






