Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం మరోసారి అరెస్టు.. ఈసారి ఆ కేసులో..

by Thanuru Gopichand |   (  Updated:2025-05-18 10:16:39  IST  )

టీడీపీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్​దాడికి పాల్పడ్డాడు.

Nandigam Suresh:  మాజీ ఎంపీ నందిగం మరోసారి అరెస్టు.. ఈసారి ఆ కేసులో..
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్​ను (Nandigam suresh) పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈసారి ఆయన ఓ టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో అరెస్టు (Arrest) అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉద్దండ్రా యునిపాలెంలో నిన్న రాత్రి కారు నడిపే విషయంలో గొడవ జరిగింది. ఓ వ్యక్తి కారును అతివేగంగా నడపడంతో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు మందలించాడు. కొద్దిసేపటికి రాజుపై నందిగం సురేష్​అనుచరులు దాడికి పాల్పడి.. అతనిని సురేష్​ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ నందిగం సురేష్, అతని అన్న ప్రభుదాసు, కుటుంబ సభ్యులు కలిసి రాజుపై మరోసారి దాడి చేశారు. గాయపడిన రాజు మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నందిగం సురేష్​ను అరెస్టు చేశారు. అతనిని తుళ్లూరు పోలీసుస్టేషన్​కు తరలించారు. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేష్​దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసులో అరెస్టు అయ్యాడు.

Next Story