మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2024-08-02 11:21:20  IST  )

వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన్ను పోలీసులు శుక్రవారం గన్నవరంలోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వంశీ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. ఈ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీతో పాటు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వంశీ మినహా మిగిలిన వారిని కోర్టులో హాజరుపర్చారు.

Next Story