బెంగళూరులో జగన్ ఆస్తులు: యనమల సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

బెంగళూరులో జగన్ ఆస్తులపై మాజీ మంత్రి యనమల సంచలన ఆరోపణలు చేశారు..

బెంగళూరులో జగన్ ఆస్తులు: యనమల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) బెంగళూరు(Bengaluru)లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఉండటంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Former Minsiter Yanamala Ramakrishnudu) ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు అక్రమ ఆస్తులు దాచుకునేందుకే ఆ రాష్ట్రంలో జగన్ ఉంటున్నారని ఆరోపించారు. ఏపీలో రాజకీయం చేస్తూ జగన్ బెంగళూరులో ఉంటున్నారని సెటైర్లు వేశారు. ఆస్తులు దాచిపెట్టుకుంటున్నారు కాబట్టే జగన్ అక్కడ ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని యనమల నిలదీశారు. కాగా గత ఐదేళ్లలో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకుల ఇదే రకమైన విమర్శలు కురిపించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఉంటారని, అమరావతిలో ఇళ్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూటమి నాయకులు కూడా జగన్ పై అదే విధంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఏపీలో కాకుండా బెంగళూరులో ఉంటున్నారని విమర్శిస్తున్నారు.

Next Story