- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder Case)లో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన కడప రిమ్స్ ఆస్పత్రి(Kadapa Rims Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిని వైద్యులు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకానందారెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పని చేశారు. వివేకా హత్య సమయంలో ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకా కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు.
కాగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోని బాత్ రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న వివేకానందారెడ్డి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు సీబీఐ అధికారుల చేతికి కేసు చేరింది. ఆ తర్వాత విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే వివేకానందారెడ్డి హత్య కేసులో మొత్తం 23 మందిని విచారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది.






