దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోతే.. రాజకీయం చేస్తారా: టీడీపీ నేతలపై మాజీ మంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-20 17:33:37  IST  )

టీడీపీ నాయకులపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు...

దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోతే.. రాజకీయం చేస్తారా: టీడీపీ నేతలపై మాజీ మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former Cm Jagan) పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా రెంటపాళ్లలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణాలపై టీడీపీ(Tdp) నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని(Former Minister Vidadala Rajini) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పర్యటనలో ఇద్దరు దురదృష్టవశాత్తు చనిపోతే వారిపైనా రాజకీయాలు చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. ఆ ఘటనలను వివాదస్పదంగా మార్చేందుకు కూటమి నాయకులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కాన్వాయ్ తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని రజిని వ్యాఖ్యానించారు. సత్తెనపల్లిలో ఓ యువకుడు సొమ్మసిల్లిపడిపోయి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారని తెలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించామని తెలిపారు. వారి కుటుంబాల బాధ్యతలను తాము గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. చనిపోయిన ఇద్దరి అంత్యక్రియలకు సైతం వైసీపీ నేతలు పాల్గొన్నారని, ఆ కుటుంబాలను కూడా ఓదార్చారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. పోలీసుల వేధింపులతో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తే అడ్డుకోవడానికి కూటమి నాయకులు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ ప్రజాదారణ భారీగా లభించిందని రజని పేర్కొన్నారు.

Next Story