- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ముసలావిడ నొక్కగలిగే బటన్.. మీరెందుకు నొక్కట్లేదు’.. మాజీ మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్!
రాష్టరంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్టరంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) మరోసారి కూటమి ప్రభుత్వం(AP Government) పై విమర్శలు గుప్పించారు. అయితే ఇవాళ(శుక్రవారం) నగరిలోని తన క్యాంపు కార్యాలయం(Camp Office)లో మాజీ మంత్రి రోజా(Roja) మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ..భవిష్యత్ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మూలన కూర్చున్న ముసలమ్మ కూడా వైఎస్ జగన్(YS Jagan) లాగా బటన్ నొక్కగలరని గతంలో చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడెందుకు బటన్ నొక్కట్లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) పథకాలను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజలకు లబ్ది చేకూరుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఓడి, చేయూత తదితర పథకాలు ఆపేశారన్నారు. సంపద సష్టించాకే పథకాల అమలు చేస్తామని ఎన్నికలప్పుడే ఎందుకు చెప్పలేదని ఆమె నిలదీశారు.
ఇప్పుడేమో సంపద సృష్టించాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు(CM Chandrababu) చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయిన ఏడు నెలల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి, నాడు-నేడు పనులు, ఆరోగ్యశ్రీ పథకం, వాలంటీర్ వ్యవస్థను ఆపేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు IR లేదు. కనీసం DA కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కూటమి నేతలు మాజీ సీఎం జగన్(Former CM Jagan)ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు.






