ఆ రూ.360 కోట్లు విడుదల చేయండి: మాజీ మంత్రి రోజా డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-21 10:38:02  IST  )

మామిడి రైతుల సమస్యలపై మాజీ మంత్రి రోజా మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు..

ఆ రూ.360 కోట్లు విడుదల చేయండి: మాజీ మంత్రి రోజా డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మామిడి రైతుల(Mango Farmers) సమస్యలను పరిష్కారిస్తామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కొద్ది రోజుల క్రితం తుఫాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలబడినప్పటికీ.. పరిశ్రమలు మాత్రం పట్టించుకోలేదు. దీంతో మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మామడి రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున కిలో రూ. 4, ఫ్యాక్టరీలు రూ.8 కలిపి మొత్తంగా రూ. 12 ఇస్తానని చెప్పి ఇప్పుడు విస్మరించారని రోజా ఆరోపించారు. మామిడి రైతులకు ఇస్తామన్న రూ. 180 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినా కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు మాత్రం ఇవ్వాల్సిన రూ. 360 కోట్లను విడుదల చేయలేదని తెలిపారు.

అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన చేశారు. దీంతో రైతులను తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తోలారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు ఫ్యాక్టరీలు 8 రూపాయలు చొప్పున మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడిచినా ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు విడుదల చేయాలి.’’ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు.

Next Story