గబ్బర్‌ సింగ్‌ డైలాగులు చెప్పి.. ఇప్పుడు రబ్బర్‌లా మెలికలు తిరుగుతున్నారు: పవన్‌పై రోజా సెటైర్లు

by Vemula.Srinu Prasad |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి విమర్శలు చేశారు....

గబ్బర్‌ సింగ్‌ డైలాగులు చెప్పి.. ఇప్పుడు రబ్బర్‌లా మెలికలు తిరుగుతున్నారు: పవన్‌పై రోజా సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై మాజీ మంత్రి రోజా(Former Minister Roja) మరోసారి రెచ్చిపోయి విమర్శలు చేశారు. వైసీపీ యువత పోరు(Ycp Yuvatha Poru) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ఒక్కరికీ కూడాఉద్యోగం ఇవ్వలేదన్నారు. నారా లోకేష్‌(Nara Lokesh)ను సీఎం చేయాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. నాగబాబు(Nagababu)కు మంత్రి పదవి కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో గబ్బర్‌ సింగ్‌ డైలాగులు చెప్పి ఇప్పుడు పవన్‌ రబ్బర్‌లా మెలికలు తిరుగుతున్నారని, ప్రత్యేక హెలికాప్టర్లు కొంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతికి మాత్రం డబ్బులు లేవంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం బాధాకరమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.

జగన్ ఎక్కడికి వెళ్లాని జన ప్రవాహం ఉంటుందని, ఆయనకు వస్తున్న ప్రజాదరణను కూటమి ప్రభుత్వం ఓర్వకోలేకపోతోందని రోజా విమర్శించారు. జగన్ కాన్వాయ్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఎస్పీ చేతనే అబద్ధం చెప్పించారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని రోజా ఆరోపించారు.

Next Story